మన భౌతిక మరియు ఆత్మీక జీవితాలలో, ఎల్లప్పుడూ అనేక శోధనలు మరియు అడ్డంకులు ఉంటాయి. గతంలో, ఇశ్రాయేలీయులు గొప్ప శ్రమలను ఎదుర్కొన్నప్పుడు—నీరు మరియు ఆహారం లేని ఎడారి మరియు రాక్షసులు నివసించిన కనాను నేలను ఎదుర్కొన్నప్పుడు, యెహోషువా మరియు కాలేబు దేవునిపై మాత్రమే తమ నిరీక్షణను ఉంచారు. వారి వలెనే, కష్టాల మధ్యన దేవుడు మన కొరకు తెరిచిన నిరీక్షణ ద్వారమును చూడగల విశ్వాసము మనకు అవసరము.
యేసు పునరుత్థానము మరియు ఆరోహణము ద్వారా వలెనే, యేసు సిలువ మరణం పట్ల నిరాశ చెందిన తొలినాటి సంఘ పరిశుద్ధుల కొరకు దేవుడు పరలోక రాజ్యమునకు నిరీక్షణ ద్వారమును తెరిచారు, మరియు రాత్రంతా ఏమీ పట్టని పేతురుకు, ఆయన వాక్యముపై నడుచునపుడు జరిగే అద్భుతమును యేసు చూపించినట్లుగానే, ఈరోజు కూడా, “సువార్త లోకమంతట ప్రకటించబడును” అని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సెలవిచ్చిన వాక్యములు ఖచ్చితంగా నెరవేరబడును.
–యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను . . . ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. కీర్తనలు 39:4–7
అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. మత్తయి 24:13–14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం