అదృశ్యమైన సమయం గడవటాన్ని మనం చూసేందుకు గడియారాలు కనిపెట్టబడినట్లుగానే,
అదృశ్యమైన ఆత్మీక లోకంలో పరలోకానికి లేదా నరకానికి వెళ్ళే తీర్పును పరిశుద్ధగ్రంథం ద్వారా
మనం చూడవచ్చు.
వెలుగుగా వచ్చిన యేసు, మెల్కీసెదెకు యొక్క క్రమంలో వచ్చారు కాబట్టి,
ఆయన అనుచరులైన, దేవుని సంఘ సభ్యులు కూడా, క్రొత్త నిబంధన పస్కాను ఆచరించి,
ఆయన బోధనలను వెంబడిస్తారు.
రెండువేల సంవత్సరాల క్రితం, ప్రజలు రెండు బృందాలుగా విభజించబడ్డారు—
శరీరధారిగా వచ్చిన యేసును తమ రక్షకునిగా విశ్వసించినవారు మరియు విశ్వసించనివారు,
మరియు పరిశుద్ధాత్మ యుగంలో, ఆత్మ మరియు పెండ్లికుమార్తె వలె వచ్చియున్న
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించువారు ఉన్నారు
మరియు విశ్వసించనివారు ఉన్నారు.
ఈ విశ్వాసము ఆధారంగా దేవుని యొక్క తీర్పు ముందే
నిర్ణయించబడిందని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది.
ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున
మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్క్రియలుగా
కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని
ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
యోహాను 3:19-21
మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా–
దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
1 యోహాను 1:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం