మనం వెలుగును చూసినప్పుడు, మన వెనుక నీడ కనిపిస్తుంది,
కానీ మనం వెలుతురు వైపు మన వీపును తిప్పినపుడు, ఒక నీడ మన దారిని అడ్డుకుంటుంది.
అదేవిధంగా, మానవాళి వెలుగైయున్న దేవుని వైపు వెళ్ళినప్పుడు,
చీకటి వారిని ఎన్నటికీ ఆపలేదు.
తండ్రి యుగంలో యిర్మీయా మరియు కుమారుని యుగంలో అపొస్తలుల వలె,
మనం దేవుని మహిమ యొక్క వెలుగును ప్రకాశింపజేసినప్పుడు మన చుట్టూ
మనం హింసలను మరియు అడ్డంకులను ఎదుర్కోవచ్చు.
కానీ, చివరలో, మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొనెదము.
యెషయా, యిర్మీయా మరియు యెహెజ్కేలు తండ్రి యుగంలో యెహోవా దేవుని యొక్క
వెలుగును అందించారు, మరియు అపొస్తలుడైన పౌలు, పేతురు, మరియు యోహాను
కుమారుని యుగంలో యేసు మహిమ యొక్క వెలుగును అందించారు.
అదేవిధంగా, పరిశుద్ధాత్మ యుగంలో, దేవుని సంఘము సభ్యులు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలలో
రక్షకులుగా ప్రత్యక్షమైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు యెరూషలేము పరలోక తల్లి యొక్క
మహిమ గల వెలుగును అందిస్తారు.
“నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది
యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.
జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.”
యెషయా 60:1-3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం