ఆసా రాజు మరియు యెహోషాపాతు రాజు దేవుని విధులను మరియు నియమాలను విశ్వాసపూర్వకంగా పాటించి, ప్రతి విగ్రహాన్ని పడగొట్టి, దేవుడు తమకు ఉన్నంత కాలం సమస్తము మంచిగా జరుగునని చలించని నమ్మకంతో తమ ప్రజలను మరియు రాజ్యాలను పాలించారు. ఫలితంగా, దేవుడు వారి దేశానికి శాంతిని అనుగ్రహించి, ఉప్పొంగే ఆశీర్వాదాలను మరియు మహిమను వారిపై కుమ్మరించారు.
పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన చరిత్ర ద్వారా, దేవుడు తన ఆశీర్వాదాలను పొందుకునే మార్గాన్ని మానవాళికి చూపించారు. ఆసా తన తర్వాతి సంవత్సరాలలో చేసినట్లుగా, దేవుని వెదకటం మానుకొని శక్తివంతమైన దేశాల వైపు తిరిగే పాపం మనం చేయకూడదు. అలాగే యెహోషాపాతు వలె చెడు చేయువారితో సహవాసం చేయుచు వారితో కలిసి ఏ కార్యమూ చేపట్టకూడదు. ఎందుకనగా మనం దేవుని మరిచిపోయి మన చుట్టూ ఉన్న ప్రజలపై మరియు పరిస్థితులపై నమ్మకముంచినప్పుడు, ఆయన తన ఆశీర్వాదాలను మన నుండి ఉపసంహరించుకుంటారు.
ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమపితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదుమనియు... ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవావారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములులేకుండ వారికి నెమ్మది కలుగజేసెను. 2 దినవృత్తాంతములు 15:10–15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం