తనను రొట్టె మరియు ద్రాక్షారసంతో దీవించిన మెల్కీసెదెకునకు అబ్రహాము దశమ భాగమును
ఇచ్చెను, మరియు “మెల్కీసెదెకు క్రమమును పాటించే నిత్య యాజకుడు అనగా దేవుడు” అని
దావీదు ప్రవచించెను. ఇంకనూ, “మెల్కీసెదెకు తండ్రి లేక తల్లిలేని వాడును లేక వంశావళి
లేనివాడును” అని వివరించటం ద్వారా, మానవాళి యొక్క రక్షణ నిమిత్తము
పరిశుద్ధాత్మ యుగంలో మరలా వచ్చే క్రీస్తు గురించి అపొస్తలుడైన పౌలు సాక్ష్యమిచ్చెను.
పాతనిబంధన యొక్క మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా భౌతికమైన
ఆశీర్వాదాన్ని ఇచ్చెను. అదే విధంగా, క్రొత్త నిబంధన పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా
యేసు పాప క్షమాపణ మరియు నిత్య జీవము యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చారు. 1,600 సం.ల పాటుగా
కొట్టివేయబడి నిలిచిపోయిన క్రొత్త నిబంధన పస్కాను పునరుద్ధరించటం ద్వారా, తాను మెల్కీసెదెకు యొక్క
క్రమంలో వచ్చిన దేవుడనని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సాక్ష్యమిచ్చారు.
అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి
వచ్చినప్పుడు . . . షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును
తీసికొనివచ్చెను . . . అప్పుడతడు (అబ్రాహము) అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
ఆదికాండము 14:17–20
యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి . . .
యేసు ఒక రొట్టె పట్టుకొని . . . ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
వారికిచ్చి దీని లోనిది మీరందరు త్రాగుడి ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ
నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
మత్తయి 26:19–28
ఈ పర్వతముమీద సైన్యముల కధిపతియగు యెహోవా . . . మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో
విందుచేయును . . . మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును . . .
ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము
కనిపెట్టుకొనియున్న మన దేవుడు . . .
యెషయా 25:6–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం