రెండవ పది ఆజ్ఞలను ఉంచడానికి పర్ణశాలను నిర్మించుమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించారు. మొదటి పది ఆజ్ఞలను ఉల్లంఘించిన ఫలితంగా వారి పాపాన్ని ప్రజలు గ్రహించినప్పుడు, వారు పశ్చాత్తాపపడి ఇష్టపూర్వకంగా పర్ణశాలకు కావలసిన సామగ్రిని తీసుకువచ్చారు. ఇది పర్ణశాల పండుగ యొక్క మూలంగా మారింది.
ఆ తర్వాత, వారు మందిరపు ఆవరణలో లేదా మందిరం యొక్క పైకప్పు మీద రకరకాల చెట్ల కొమ్మలను ఉపయోగించి పర్ణశాలలు కట్టుకొనిరి.
పర్ణశాలల పండుగ అనునది క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు మరియు తల్లియైన దేవుడు తమ ప్రజలందరినీ ఒకచోట సమకూర్చే దినము. తమను క్షమించి, తమ పాపాల నుండి రక్షించిన దేవునికి మానవజాతి కృతజ్ఞతలు చెల్లించవలెను. మరియు వారు పొందుకున్న కడవరి వర్షపు పరిశుద్ధాత్మ ద్వారా, పరలోక యెరూషలేము మందిరము కొరకు సామగ్రి అయిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరలోక కుటుంబ సభ్యులందరినీ కనుగొనవలెను.
కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు “. . . ఈ మాటలు . . . నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.”
యిర్మీయా 5:14
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
ఎఫెసీయులు 2:21-22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం