మనం తప్పక దేవుని వెదకవలెను ఎందుకనగా మనం జీవితాలలోని సమస్యలకు
సమాధానాలు ఎల్లప్పుడూ దేవుని చేతనే ఇవ్వబడును.
దావీదు, యెహోషాపాతు మరియు హిజ్కియాలు ఆశీర్వాదకరమైన మరియు విజయవంతమైన
జీవితాన్ని గడపడానికి కారణం వారు మనుషులపై లేదా భౌతిక ప్రపంచంలోని వస్తువులపై కాకుండా,
దేవునిపై ఆధారపడి యుండెను.
ఈ యుగంలో జీవిస్తున్న మన కోసం దేవుడు గత చరిత్రను పరిశుద్ధ గ్రంథమందు నమోదు చేశారు.
యెరికోను జయించినప్పుడు మరియు ఎర్ర సముద్రం విభజించబడినపుడు
దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉండెను.
దీన్ని దృష్టిలో ఉంచుకుని, దేవుని సంఘము యొక్క సభ్యులు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా
ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడతారు.
హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను
యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.
. . . ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని
అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.
2 దినవృత్తాంతములు 31:20-21
అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు
కానుకలను తెచ్చి యిచ్చిరి. అందువలన అతడు అప్పటినుండి
సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.
2 దినవృత్తాంతములు 32:23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం