ఏశావు మరియు యుదా ఇస్కరియోతు తమ నిర్లక్ష్యపూరితమైన మాటల వల్ల ఆశీర్వాదాలను కోల్పోయారు, మరియు కుడివైపున దొంగ మరియు దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు విశ్వాసంతో తాము మాట్లాడిన మాటల వల్ల దేవుని నుండి పొంగిపారే ఆశీర్వాదాలను పొందుకున్నారు.
మన నోటి నుండి బయటకు వచ్చే మాటలు ఎన్నటికీ అదృశ్యం కాక తీర్పు దినమందు మన వద్దకు తిరిగి వచ్చును కాబట్టి, మనం మాట్లాడుటకు ముందు అనేక మార్లు ఆలోచించవలెనని మరియు కోపగించుటకు నెమ్మదించవలెనని దేవుడెల్లప్పుడూ మనకు బోధిస్తుంటారు.
మనం పాపం చేసినందువల్ల పరలోకం నుండి క్రిందకి త్రోసివేయబడ్డామని గ్రహించినట్లైతే, ఏ విషయంలోను మనం నిరాశగా భావించము. బదులుగా, మనం పరిశుద్ధాత్మ యుగంలో వచ్చియున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవునితో ఉండగలమనే నిజం పట్ల దేవుని యొక్క బోధనలను పాటిస్తూ కృతజ్ఞతగా ఉంటూ మరియు మంచి విషయాలు పలుకుచూ ఆశీర్వాదకరమైన జీవితం జీవించగలము.
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు . . . మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండుడి . . . క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
యాకోబు 1:19–25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం