క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు 1918లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని జియోల్లాబుక్-డో, జంగ్సు-గన్ లో ఉన్న ఒక మైనింగ్ పట్టణంలో జన్మించారు. 2,000 సంవత్సరాల క్రితం యేసు యొక్క మొదటి రాకడలో, ఒక మూగ జంతువు కూడా తన పశువుల తొట్టిని ఆయనకు అర్పించెను మరియు తూర్పు నుండి వచ్చిన మాంత్రికులు ఆయనకు బంగారము, ధూపద్రవ్యము, మరియు బొడ్డు పువ్వుల కానుకలను అర్పించారు. ఆయన రెండవసారి ఈ భూమిపైకి ఒక మానవునిగా వచ్చినపుడు, ఆయన జన్మించిన క్షణం నుండి, ఆయన శోధనలు మరియు శ్రమలను అనుభవించారు.
1918లో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు జన్మించినపుడు, ప్రపంచమంతటినీ మరణపు పీడకలలోకి నడిపించిన మొదటి ప్రపంచ యుద్ధం ముగియక ముందే, భూమి అంతటిపై మరలా మరణపు ఛాయ కమ్ముకున్నది. స్పానిష్ ఫ్లూ ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి సోకింది మరియు 50 నుండి 100 మిలియన్ల ప్రజలను చంపింది. “వైద్య హోలోకాస్ట్” అనబడే విపత్తు యొక్క భయానికి కొరియా మినహాయింపు కాకుండెను. ఒక గ్రామంలోని ప్రజలందరూ వ్యాధి బారిన పడ్డారు మరియు మృతదేహాలను పాతిపెట్టుటకు ఎవ్వరూ లేకుండెను. స్పానిష్ ఫ్లూ 7.6 మిలియన్లకు సోకింది, 40% కొరియన్లు, మరియు వారిలో 140,000 మంది మరణించారు.
ఈ భూమిపై సాతాను ఏ మానవాళి యొక్క జీవితాలపై ఈ మరణ విందును నిర్వహించాడు?
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యేసు జన్మించినపుడు, హేరోదు రాజు యేసును చంపుటకు బెత్లెహేము మరియు దాని పరిసర ప్రాంతాలలోని పిల్లలందరినీ ఊచకోత కోశాడు. అదేవిధంగా, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, సాతాను పిల్లలందరినీ చంపడం ద్వారా రెండవ రాకడ క్రీస్తు యొక్క పుట్టుకను అడ్డుకొనుటకు ప్రయత్నించెను (మత్తయి 2:13-16).
ఏమైనా, అంధకారము యొక్క శక్తి సర్వశక్తిగల దేవుని యొక్క ఉద్దేశ్యమును మరియు చిత్తమును ఎన్నటికీ ఆటంకపరచదు.
రాజైన దావీదు యొక్క ప్రవచనాలు మరియు అంజూరపు చెట్టు యొక్క ఉపమానం ప్రకారంగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు 1918లో జన్మించారు మరియు 1948లో ముప్పై సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొందారు, మరియు క్రొత్త నిబంధన యొక్క జీవపు వెలుగును ప్రకాశించారు.
వరల్డ్ మిషన్ సొసైటీ చర్చి ఆఫ్ గాడ్ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాల ప్రకారంగా రెండవసారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని విశ్వసిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం