దేవుడు గిద్యోను సైన్యాన్ని ఎన్నుకున్నప్పుడు, భయపడే వారిని ఆయన తిరస్కరించారు. భయపడవద్దని ఆయన ఎల్లప్పుడూ
యెహోషువా సైన్యానికి ప్రముఖంగా చెప్పారు. దీని ద్వారా, దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచడం మరియు
ధైర్యంగా ముందుకు సాగడం చాలా ముఖ్యమైన విషయం అని మనం చూడవచ్చు.
దేవుని వాగ్దానాలను విశ్వసించని ఇశ్రాయేలీయులు, చెడు సమచారాన్ని వ్యాప్తి చేసి, కనాను గురించి ఫిర్యాదు చేసినట్లే,
మనం ప్రజలకు మరియు పర్యావరణానికి భయపడిన కారణంగా మనం సందేహిస్తున్నట్లైతే, మనం ఆత్మీక కనాను అయిన,
పరలోక రాజ్యంలో మనమెన్నటికీ ప్రవేశించలేము. మనలను దీవించుటకై క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
తల్లియైన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వసిస్తూ, పరలోక రాజ్య సువార్తను ధైర్యంగా ప్రకటించునపుడు,
సర్వ లోకాన్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన సువార్త కార్యము జరుగును.
"ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు
నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము.
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.”
యెహోషువా 1:8-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం