వరల్డ్ మిషన్ సొసైటీ చర్చి ఆఫ్ గాడ్ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాల ప్రకారంగా రెండవసారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని విశ్వసిస్తుంది.
2,000 సంవత్సరాల క్రితం తన రెండవ రాకడ యొక్క సూచన గురించి శిష్యులు యేసును అడిగినపుడు, ఆయన వారితో అంజూరపు చెట్టు యొక్క ఉపమానమును నేర్చుకొనుమని చెప్పారు.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. (మత్తయి 24:30-33)
అంజూరపు చెట్టు యొక్క ఉపమానం ద్వారా, యేసు తన రెండవ రాకడ యొక్క సమయాన్ని తెలియజేశారు. అయితే, పరిశుద్ధగ్రంథంలో అంజూరపు చెట్టు దేనిని సూచిస్తుంది?
పాత నిబంధన కాలం నుండి, అంజూరపు చెట్టు ఇశ్రాయేలును సూచిస్తుంది (యిర్మీయా 24:5). క్రొత్త నిబంధన సమయాలలో, యేసు క్రీస్తు కూడా, తన బోధనలలో ఇశ్రాయేలును అంజూరపు చెట్టుతో పోల్చారు (మార్కు 11:12-14, 20-21). అంజూరపు చెట్టు చేత సూచించబడిన ఇశ్రాయేలు చరిత్రలో, రెండవ రాకడ యేసు క్రీస్తు యొక్క సమయం గురించి ఒక రహస్యం కలదు.
“అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు” అనగా ఎండిపోయిన అంజూరపు చెట్టు తిరిగి జీవములోకి వచ్చునని అర్థం. నాశనమైన ఇశ్రాయేలు, పునరుద్ధరించబడుతుందని ఇది సూచిస్తుంది. యేసు క్రీస్తు ప్రవచించినట్లుగానే, క్రీ.శ. 70లో ఇశ్రాయేలు రోమా సామ్రాజ్యం చేత నాశనం చేయబడెను, మరియు దాదాపు 1,900 సంవత్సరాల పాటుగా ప్రపంచమంతటా చెల్లాచెదురుగా, ప్రవాస జీవితం గడుపుచున్నది.
అంజూరపు చెట్టు యొక్క ఉపమానం గురించిన ప్రవచనాన్ని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు నెరవేర్చారు
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఇశ్రాయేలు తన స్వాతంత్రాన్ని ప్రకటించుకొని తన పూర్వ స్వదేశమైన పాలస్తీనాలో ఒక రాజ్యాన్ని స్థాపించింది.
మరియొక మాటలలో, యేసు ప్రవచించినట్లుగా అంజూరపు చెట్టు పునరుద్ధరించబడెను. ఇశ్రాయేలు స్వాతంత్ర్యం ప్రపంచంలో మరెక్కడా లేని అద్భుతమని చరిత్రకారులు చెప్పారు. ఏమైనా, అది కేవలం ఒక చారిత్రాత్మక సంఘటన కాకుండెను. దేవుడు ప్రణాళిక చేసినట్లుగా యేసు రెండవసారి వచ్చారని సర్వలోకము పట్ల ప్రకటించే ప్రవచనాత్మక సూచన అది.
ఎండిపోయిన అంజూరపు చెట్టు పునరుద్ధరించబడినట్లుగా, ఇశ్రాయేలు 1948లో పునర్నిర్మించబడెను. ఈ సంవత్సరంలో, యేసు రెండవ సారి వచ్చి బాప్తిస్మము పొందిన తర్వాత సువార్త కార్యమును ప్రారంభించవలసియుండెను. 2,000 సంవత్సరాల క్రితం తాను స్థాపించిన క్రొత్త నిబంధన యొక్క సువార్తను కూడా ఆయన పునరుద్ధరించవలసియుండెను. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనాలను పూర్తిగా నెరవేర్చుటకు రెండవ సారి వచ్చిన క్రీస్తు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం